అవినీతిపరుడైన పోలీస్.. అత్యాచార బాధితురాలు..

Evaru trailer launched,Evaru movie updates,Adivi sesh Evaru movie

అడవి శేష్, నవీన్ చంద్ర, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎవరు’ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. రెజీనాను రేప్ చేయబోయిన నవీన్ చంద్రను ఆమె కాల్చిచంపడంతో సినిమా ట్రైలర్ ప్రారంభవుతుంది.

అయితే నిజంగానే అత్యాచారయత్నం జరిగిందా? లేక దీనివెనుక మరో కుట్ర ఉందా? అనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును పోలీస్ అధికారి విక్రమ్ వసుదేవ్(అడవి శేష్) కు అప్పగిస్తారు. ఈ కేసును విక్రమ్ ఎలా సాల్వ్ చేశాడన్న సస్పెన్స్ తో సినిమా కొనసాగుతుంది. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ను మీరూ చూసేయండి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.