నటీనటులు : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక
దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
సంగీతం : ప్రశాంత్ ఆర్ వర్మ
రేటింగ్: 2.5/5
కె.వి.ఆర్ మహేంద్ర దర్శకత్వంలో శివాత్మిక రాజశేఖర్ – ఆనంద్ దేవరకొండలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినమాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘దొరసాని’. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ:
స్టోరీ లైన్ కొత్తదేమీ కాదు. గొప్పింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమకథ చివరికి ఏమైందనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది పూర్తిగా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో సాగిన ప్రేమకథ. అందులోనూ ఒకప్పటి దొరల కాలంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కథ. అప్పటి దొరల కుటుంబాలు పరువు కోసం ఎంతకైనా తెగిస్తాయని చెప్పే కథ. రాజు (ఆనంద్) ఇళ్లకు సున్నాలేసే ఒక పేదోడి కొడుకు. దేవకి (శివాత్మిక) ఆ ఊరి దొర (వినయ్ వర్మ) కూతురు, చిన్న దొరసాని. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అది కాస్త దొరకు తెలుస్తుంది. ఆ తరవాత ఏం జరిగింది? పేదోడు తమ పక్కన నిలబడటాన్ని కూడా సహించని దొర.. తన కూతురు చేయిపట్టుకున్న రాజును ఏం చేశాడు? అనేదే సినిమా.
నటీనటులు:
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు ఇదే తొలి చిత్రం. చాలా బరువైన పాత్రను సమర్థంగా పోషించారు. తొలి చిత్రమే అయినా, ఎక్కడా తడబాటు లేదు. తన గొంతు కూడా విజయ్ దేవరకొండ గొంతును పోలి ఉండటం వల్ల తెరపై అతన్ని చూసినట్లు అనిపిస్తుంది. దేవకి పాత్రకు శివాత్మిక వందశాతం న్యాయం చేశారు. లుక్స్ పరంగా ఆకట్టుకున్నారు. ఆమెకు మాట్లాడే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఇచ్చారు దర్శకుడు. కీలకమైన పాత్రలో కిషోర్ రాణించారు. దాదాపు 60మంది కొత్త వాళ్లను పరిచయం చేసిన చిత్రమిది.
ప్లస్ పాయింట్స్:
తెలంగాణ నేపథ్యం
నటీనటుల సహజ నటన
పతాక సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ
స్లో నరేషన్
సాంకేతిక విభాగం :
కె.వి.ఆర్ మహేంద్ర మంచి నేపథ్యంలో ఆసక్తికరమైన పాత్రలతో ఈ సినిమాను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా.. కథనం విషయంలో మాత్రం బాగా నెమ్మదిగా కనిపించారు. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా అప్పటి కాలాన్ని గుర్తు చేస్తూ నడుస్తాయి. నిర్మాతలు ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాతల ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.
తీర్పు :
మొత్తంమీద ఈ సినిమా మంచి ఫ్యూర్ ప్రేమ కథా చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు అలరిస్తోందో చూడాలి.
Please submit your comments.