"ఛలో ఆత్మకూరు" ఆగదు!

ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఛలో ఆత్మకూరు పై రాజీ పడే ప్రసక్తే లేదు మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉండవల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉన్న టిడిపి సీనియర్ నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, చినరాజప్ప,లోకేష్, రామానాయుడు, నాగేశ్వర్ రెడ్డి, రామరాజు పాల్గొన్నారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంపై చర్చించారు. ప్రశాంతంగా జరిగే ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం గర్హనీయమన్నారు చంద్రబాబు.

బాధితులకు న్యాయం చేయకుండా, న్యాయం చేయమని అడిగేవారిని అణిచేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పోలీసులు అప్పుడే సమర్ధంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ‘‘ఛలో ఆత్మకూరు’’ కార్యక్రమం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులకు పాలు-నీళ్లు, భోజనం అడ్డుకోవడం నిర్బంధం కాదా..? అంటూ మండిపడ్డారు. శిబిరానికి వచ్చే భోజనాలు అడ్డుకుంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. నా ఇంటికి వచ్చే మీడియాను వెంటబడి తరుముతారా..? ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు..? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు మాజీ సీఎం. ఇంత పెద్ద ఎత్తున హౌస్ అరెస్ట్‌లు చరిత్ర లేవన్నారు. ఇంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారన్నారు

వైసిపి ప్రభుత్వ అణిచివేత వైఖరిని అందరూ గర్హించాలని పిలుపునిచ్చారు. ప్రజా సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. నివసించే హక్కు, ఆస్తులు కాపాడుకునే హక్కు అందరికీ ఉందన్నారు చంద్రబాబు. బాధితులకు న్యాయం చేయడంలో సర్కార్ విఫలం అయిందని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను నేనే గ్రామానికి తీసుకెళ్తానన్నారు చంద్రబాబు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

ఇక యుద్ధం జరిగేది జగన్-పవన్ మద్యే..!

జగన్ పాలన బాగుంటే సినిమాలు చేసుకుంటా అన్నవుగా..తథాస్తు!

అభివృద్ధి రానప్పుడు..మారిస్తే, కంగారెందుకు?

జగనన్న గోరుముద్ద.. రోజుకో రకం భోజనం.. వైరల్ అవుతున్న మెనూ!

సరిలేరు నీకెవ్వరు మూవీ సరికొత్త రికార్డు

ఈరోజు రాత్రి అత్యవసర భేటీ.. మంత్రులకు సీఎం ఆదేశం

దొంగతనం చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన పోలీస్.. వైరల్ వీడియో

ఐటీఐలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

మళ్ళీ పవన్ కి సెటైర్ వేసిన ఆర్జీవీ!

వైసీపీ నేతలకి తలనొప్పిగా మారిన మూడు రాజధానుల బిల్లు

వైజాగ్ వద్దు, ఈసారికి విజయవాడ: జగన్ సర్కార్

ఇండియా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో..!

అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు జగన్.. రియల్ ఎస్టేట్ మాఫియా

హాట్ హాట్ ఫోటోలతో.. సురేఖావాణి రచ్చ!

RRR అప్డేట్: రంగంలోకి బాలీవుడ్ సూపర్ స్టార్

తెలంగాణాలో మున్సి‘పోల్స్’.. ప్రత్యేక ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబుపై విమర్శల దాడి పెంచిన వైసీపీ

టీడీపీకి మరో కీలక నేత రాజీనామా..?

జగన్, చంద్రబాబుల ఆసక్తికర సంభాషణ

అంతా.. నువ్వే చేసావు.. చంద్రబాబు!