క్రికెటర్‌ని సస్పెండ్ చేసిన బీసీసీఐ

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్ అనే క్రికెటర్‌ను బీసీసీఐ రెండేళ్లపాటు సస్పెండ్ చేసింది. తన పుట్టిన రోజును తప్పుగా పేర్కొన్న కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2018-19 సీజన్‌లో, 2019-20 సంవత్సరాలకు గాను రామ్ నివాస్ ఇప్పటికే అండర్-19 కింద తన పేరు నమోదు చేసుకున్నాడు. అతను తన పుట్టినరోజును 12వ డిసెంబర్ 2001గా నమోదు చేశాడు. కానీ, ఆ తర్వాత బీసీసీఐ అతని సీబీఎస్‌ఈ రికార్డులను పరిశీలిస్తే.. అతను 10వ తరగతి 2012లో పాస్ అయినట్లు తెలిసింది. అంతే అతని నిజమైన పుట్టిన తేదీ 1996 అని వెల్లడైంది. బీసీసీఐ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు గతంలో రెండుసార్లు రామ్ నివాస్ తన పుట్టిన రోజును తప్పుగా నమోదు చేసుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో అతన్ని 2020-21, 2021-22 దేశవాళీ సీజన్ల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. ఈ రెండు సంవత్సరాల నిషేధం తర్వాత అతనికి సీనియర్ క్రికెట్ జట్టులో ఆడే అవకాశం ఉంటుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.