దర్బార్ సెకండ్ లుక్ రిలీజ్

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా రజినీ సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామ‌స్ , మ‌ల‌యాళ న‌టుడు చెంబన్ వినోద్ జోస్ ద‌ర్భార్ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ఇక దాదాపు పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.