డియర్ కామ్రేడ్ నుంచి లిరికల్ సాంగ్ విడుదల

Vijay Deverakonda songs,Vijay Deverakonda songs list,dear comrade video songs,dear comrade hd songs

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి రామచంద్రన్ ఒక కీలక పాత్రలో నటించారు. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. జస్టిన్ ప్రభాకరన్ స్వరకల్పన లో రెహమాన్ రచించిన, స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ ఆలపించిన కామ్రేడ్ గీతాన్నితెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఈ రోజు 04:33 PM కు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కామ్రేడ్ గీతం ప్రేక్షక అభిమానులను ఇంప్రెస్ చేసి డియర్ కామ్రేడ్ మూవీ పై ఆసక్తి తో పాటు అంచనాలు కూడా పెంచింది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.