జగన్ ని చూసైనా.. కెసిఆర్ నేర్చుకుంటాడా?

పూర్వం పెద్దలు ఒక సామెత చెప్పే వారు " అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని" అని, ఈ సామెత అర్థం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ విషయంలో నెరవేరుతుంది. పొరుగున ఉన్న జగన్ ప్రభుత్వవాన్ని చూసైనా కనీసం కెసిఆర్ గారు కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.

అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక రెవిన్యూ విషయంలో తలా మునకలౌతున్నప్పటికీ.. మొన్నటికి మొన్న ఆర్టీసీని ప్రభుతం తో వీలనం చేశారు జగన్. ప్రజలకు సంక్షేమ కారక్రమాలని అమల పరచండంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అధికారంలోకి వచ్చి నిండా నాలుగు నెలలు కాకుండానే ఒక వైపు నవరత్నాలు అమలు పరుస్తున్నారు, మరో వైపు ఎన్నికల మ్యానిఫెస్టోను అమలపరుస్తూ శర వేగంగా జగన్ దూసుకెళ్తున్నారు. మొన్న మద్య పాన నిషేధం, నిన్న గ్రామ వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయం, వార్డు ఏర్పాట్లు, నేడు వాహనమిత్ర పథకం, ఇలా ఒకటి తర్వాత ఒకటి నెరవేస్తూ దూసుకుపోతుంటే, ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనే విషయం అందరికి తెల్సిందే.. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తి నట్లు ఉండటం ఎంత వరకు సబబు. తెరాస మేనిఫెస్టోలో ఉంచిన రెండు పడక గదుల పథకం, పేద వాళ్లకు 3 ఎకరాల పొలం, లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వంటి అనేక హామీలను మరిచిపోయింది అనే విషయం అందరికి తెలుసు.

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మిక నేతలు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీని పరక్షించడం అనగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం, సంస్థకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించడం, డీజిల్‌ భారాన్ని భరించడం, ఎలక్ట్రిక్‌ బస్సు ల రాయితీని ఆర్టీసీకే చెల్లించడం, ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనం, నిజానికి ఈ డిమాండ్లు ప్రజా సంఘాల నుండి, రాజకీయ పార్టీల నుండి, ప్రజల నుండి రావాల్సినవి కానీ ఆర్టీసీ కార్మికులు తమ గళం వినిపిస్తున్నారు సమ్మె సైరన్ మోగిస్తున్నారు. వీటితో పాటు కార్మికులకు భద్రతను, క్షేమాన్ని ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత ఇవి కూడా ప్రభుత్వం చేయకపోవడం నిజంగా బాధాకరం.

 
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. 8 Oct, 10:28 am
  krishna
  Reply

  మంచి విశ్లేషణ. పొరుగున ఉన్న జగన్ ప్రభుత్వాన్ని చూసైనా కనీసం కెసిఆర్ గారు కొంచం ఆలోచిస్తే బాగుంటుంది.

  Post comment
  Cancel