చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు

చంద్రబాబునాయుడు వ్యూహాలు పన్నటంలో సిద్ధహస్తుడని అందరూ అంటుంటారు. అది ఇంకో సారి రుజవయ్యింది. అయితే ఇందులో పారదర్శక లేకుండా తెరచాటు వ్యవహారంగా ప్రజలు పెద్దగా గమనించలేదనే భావనతో వ్యూహం పన్నినట్లు తెలుస్తుంది. తలాక్ బిల్లుపై గప్ చిప్ గా చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసాడు. అందరి దృష్టి తెరాస ఏమి చేస్తుందనే దానిపై వుంది కానీ టీడీపీ ని గురించి సందేహపడలేదు. ఎందుకంటే నిద్రలేచిన దగ్గరనుంచి పండుకో పోయిందాకా ప్రతిదానికీ మోడీని విమర్శించే చంద్రబాబునాయుడు బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తాడని అందరూ ఊహించారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని గట్టెకించాలనే తాపత్రయంతో పరోక్షమదత్తు గా బిల్లు వోటింగ్ సమయంలో తెలుగుదేశం సభ్యులు గైరు హాజరయ్యారు. అంతకుముందు సభలో మాట్లాడిన టీడీపీ సభ్యుడు బిల్లుని విమర్శిస్తూనే మాట్లాడేడు. మరి ఈ ద్వంద వైఖరి వెనుక కారణమేంటి? దీన్నే చంద్రబాబు వ్యూహంగా అర్థంచేసుకోవాలి.

వాస్తవానికి చంద్రబాబు అధికారం కోల్పోయినదగ్గర్నుంచి మోడీకి దగ్గరకావాలని ప్రయత్నిస్తున్నాడనేది కారిడార్ టాక్ . వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ టాక్ లో నిజముందనిపిస్తుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎప్పుడయితే బీజేపీ లో చేరారో అప్పుడే ఈ వాదనకు బలం చేకూరింది. ఎందుకంటే వీళ్లిద్దరూ చంద్రబాబు కి కుడి,ఎడమ భుజాలని అందరికీ తెలుసు. ఆయన్నివీళ్ళు మోసం చేసి చేసి వుంటారని ప్రజలు భావించటంలేదు. అయన డైరెక్షన్ లోనే పధకం రచించారని ఎక్కువమంది అనుకుంటున్నారు. ఆ వాదనకు రాజ్య సభలో టీడీపీ ప్రవర్తన కరెక్ట్ అని రుజువు చేసింది. దేశం మొత్తం తలాక్ బిల్లు ఏమవుతుందని ఎదురుచూస్తుంటే అనేక ప్రాంతీయపార్టీలు ఇదే వైఖరిని అవలంబించాయి. వాటికి, టీడీపీ కి తేడా ఏంటంటే చంద్రబాబునాయుడు బీజేపీ వ్యతిరేక కూటమి లో అత్యంత ప్రముఖుడు. అందుకనే తనపై ఎవరికీ సందేహం రాలేదు.

చంద్రబాబు కి పెద్ద లోపం అందరూ చెప్పేది విశ్వసనీయత లేదనేది. అది ఇంకోక్కసారి నిరూపించబడింది. మోడీ ఎన్నికల్లో అదే పాయింట్ ఫై ప్రచారం చేశాడు. ఎన్నికల్లో ఓడిపోతే తిరిగి తనదగ్గరికి వస్తాడని మోడీ ప్రచారం చేశాడు. అక్షరాలా ఇప్పుడు అదే జరిగింది. జగన్ పార్టీ నయం. విజయసాయి రెడ్డి సభలోవుండి బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశాడు. మన మీడియా దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈనాడు పత్రిక టీడీపీ వైఖరి పై ప్రజల్లో వ్యతిరేకంగా రాకుండా చూడటం కోసం వైస్సార్సీపీ కూడా గైరు హాజరు (పాక్షికంగా) అయ్యిందని హైలైట్ చేసింది. ఇది వాస్తవానికి విరుద్ధం. వైస్సార్సీపీ నాయకుడు ముందుగా మాట్లాడినట్లుగానే సభలోవుండి బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేసాడు. వైస్సార్సీపీ రెండో సభ్యుడు గైరు హాజరు కావటం హైలైట్ చేయటం పచ్చమీడియా అనిపించుకుంది. అందరూ సభ్యులు లేకపోవటం అనేది ప్రతిపార్టీ లోనూ జరిగింది. ఏమైనా చంద్రబాబునాయుడు వ్యూహంలో ఇదికూడా భాగమే కదా. చంద్రబాబు నాయుడు లో విశ్వశనీయతలేదని, ఊసరవెల్లి అనీ మరొక్కసారి రుజువయ్యింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.