చంద్రబాబు ఓ టెర్రర్రిస్ట్..!: నల్లపురెడ్డి

చంద్రబాబు ఓ టెర్రర్రిస్ట్, ఆయన ఐదు సంవత్సరాల పాలనంత అరాచకాలు, దౌర్జన్యాలు,రౌడీయిజం తోనే కొనసాగిందని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వందరోజుల పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జీర్ణించుకోలేక శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు అన్ని జిల్లాల్లో వివాదాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని ఆయన ద్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ పల్నాడులో శాంతిభద్రతలు లేవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయినప్పటికీ అన్ని జిల్లాలో వివాదాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అరాచకాలు మానుకోకపోతే ప్రజల మరోసారి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలనంత అరాచకాలు, దౌర్జన్యాలు,రౌడీయిజం తోనే కొనసాగిందని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోడెల శివప్రసాదరావు వంటి రౌడీని స్పీకర్ గా పెట్టిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి ,ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుది అని మాజీ మంత్రి ,కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబునాయుడి పాలనలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి యథేచ్ఛగా భూదందాలు, రౌడీయిజం సాగించారని ఆరోపించారు. తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేయడంపై రాష్ట్రమంతా నిరసన తెలిపినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోడెల శివప్రసాద్‌ వంటి రౌడీని శాసనసభకు స్పీకర్‌గా పెట్టిన ఘనత చంద్రబాబుదన్నారు. శాసనసభ ఫర్నిచర్‌ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్న ఘనుడు కోడెల శివప్రసాద్‌ అని ఎద్దేవా చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.