మన్మథుడు 2 ట్రోలింగ్స్: భార్య నీతులు.. భర్త బూతులు

ప్రపంచంలో అన్నిటికంటే తేలికైన పని ఇతరులకు నీతులు చెప్పడం. కానీ కష్టమైనది మాత్రం వాటిని ఆచరించడం.అప్పుడెప్పుడో మహేష్ బాబు సినిమా పోస్టర్ పై సమంతా కామెంట్లు.. ఆ వివాదం అందరికీ తెలుసు. కానీ సేమ్ సమంతా తన వ్యాఖ్యలకు విరుద్ధంగా 'మజిలీ' లో హీరో కాళ్ళను టచ్ చేసి కళ్ళకు అద్దుకుంది. ఇక తాజాగా 'మన్మథుడు 2' సినిమా విషయంలో బూతుల టాపిక్ ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయంలో అటు సీనియర్ స్టార్ నాగార్జున.. ఇటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సెన్సార్ కు పిచ్చెక్కించారు. సినిమాలో ఒకటి రెండు బూతులు కాదు డజను మేలురకం బూతులు వాడారు. అర్జున్ రెడ్డి.. ఫలక్ నుమాదాస్ ను మిక్సీలో వేసి మరీ బూతులను దంచికొట్టారు. కానీ సెన్సార్ వారు వాటిని బీప్ లు చేయమని.. హీరోయిన్ - ఝాన్సీ మధ్యలో ఉండే కిస్సును బ్లర్ చేయమని ఇలా బోలెడు సూచనలు చేసింది. నాగార్జున అరవై ఏళ్ళ వయసులో ఇలా అడల్ట్ టచ్ సినిమా చేయడం అభిమానులకు ముచ్చటగా అనిపించవచ్చేమో కానీ దీనిపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సతీమణి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిది మరో గోల. #మీటూ నుంచి ఫెమినిజం..వరకూ ఆమె స్పందించని అంశమే లేదు. ప్రూఫ్ లు ఉన్నాయా లేదా చూడకుండానే చాలామంది పై కామెంట్లు చేసింది. ఇక సగం వయసు హీరోయిన్లతో వయసు మళ్ళిన హీరోలు రోమాన్స్ చేయడంపై విమర్శలు గుప్పించింది. ఎన్నో నీతులు చెప్పింది. కానీ స్వయంగా తన భర్త సినిమాలో బూతుల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు. నాగ్ - రకుల్ రొమాన్స్ పై పెదవి విప్పలేదు. నిజానికి ఈ సినిమా బూతులపై విమర్శకుల హీట్ ఎక్కువగా నాగార్జున సార్ కే తగలాలి కానీ చిన్మయి ఓవరాక్షన్ కారణంగా నెటిజన్లు గట్టిగా చిన్మయిని.. 'భార్య నీతులు.. భర్త బూతులు' అంటూ తలంటుతున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.