బంపర్ ఆఫర్ కొట్టేసిన త్రిష!

జీతూజోసఫ్‌, మోహన్‌లాల్‌ దర్శకత్వం లో వచ్చిన ‘దృశ్యం’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ లో కూడా రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. మోహన్‌లాల్‌, జీతూజోసఫ్‌ కలయికలో మరో థ్రిల్లర్ తెరకెక్కనుంది.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష నటించనున్నట్టు తెలుస్తుంది. ‘హేజూడ్‌’ సినిమాతో గత ఏడాది మలయాళంలో అరంగేట్రం చేసింది త్రిష. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్నది. తాజాగా మోహన్‌లాల్‌కు జోడీగా మలయాళంలో రెండో సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. విదేశీ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కాబట్టి ఈజిప్ట్‌, కెనడా పలు దేశాల్లో ఇంకా ఢిల్లీ, కేరళ లో కూడా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. నవంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ పాత్రతో సమానంగా ఛాలెంజింగ్‌గా త్రిష పాత్ర ఉంటుందని చిత్రబృందం చెబుతున్నది. మరి చూద్దాం ఈ సినిమా కూడా త్రిషకు సక్సెస్ తెచ్చిపెడుతుందేమో.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.