రాజ్‌భవన్‌ మెట్లెక్కిన ఆర్టీసీ, ఫలించిన బీజేపీ వ్యూహం!

అనేకమంది రాజకీయ విశ్లేషకులు అనుకున్నదే జరిగింది, ఆర్టీసీని అస్త్రంగా, గవర్నర్ ని పావుగా వాడుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ వ్యూహం ఫలించింది. ఆర్టీసీ సమ్మెలో బీజేపీ తెరవెనుక పెద్దన్న పాత్ర వహిస్తున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు చేసి ఇటు చేసి సమ్మెను రాజ్ భవన్ మెట్లెక్కేలా చేయగలిగింది భారతీయ జనతా పార్టీ.

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన సమ్మె ఉద్ధృతమవుతున్న తరుణంలో ఆర్టీసీ ఐకాస నేతలు గవర్నర్‌ తమిళిసైను కలిశారు. ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితోపాటు పలువురు కార్మిక సంఘాల నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి ఆర్టీసీ సమ్మె, తదనంతర పరిణామాలను గవర్నర్‌కు వివరించారు.

ఇది చదవండి: కెసిఆర్ కఠినత్వం, ఆర్టీసీ ఆగ్రహం, బీజేపీకి బలం!

ఆర్టీసీని పూర్తిగా రెచ్చగొట్టి, ప్రజల అవసరాల దృష్ట్యా గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్యపై సమీక్ష జరుపుతున్నట్టు సీన్ క్రియేట్ చేసి.. కేసీఆర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయిస్తోంది బీజేపీ. భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా గవర్నర్ ను మెల్లమెల్లగా రంగంలోకి దించుతోంది . ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులతో నిరసనలు చేయిస్తూ.. గవర్నర్ తమిళ సై ఈ సమస్యను పరిష్కరించాలని వారితో చెప్పించింది. ఈ విధంగా ఆర్టీసీని అస్త్రంగా, గవర్నర్ ని పావుగా వాడుకోవాలని నిర్ణయించుకున్న బీజేపీ వ్యూహం ఫలించింది. తెలంగాణలో కొత్త గవర్నర్ హ్యాండిల్ చేయబోయే తొలి సమస్య ఇదే అవడం విశేషం.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.