బిగ్ బాస్ అనుభ‌వాన్ని మీడియాతో పంచుకున్న నాగార్జున

మ‌న్మ‌థుడు 2 సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేసుకున్న సందర్భంగా నాగార్జున ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలను చెప్పాడు.అలానే బిగ్ బాస్ అనుభ‌వాన్ని మీడియాతో పంచుకున్నాడు.ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఓ వీకెండ్ మాత్ర‌మే అయింద‌ని వ‌చ్చే వారం ఎలా ఉంటుందో అనే ఆస‌క్తి త‌న‌లో కూడా ఉంద‌ని చెప్పాడు. ఇక కంటెస్టెంట్స్ గురించి చెబుతూ బిగ్ బాస్ 3లోకి ఎవ‌రు వ‌స్తున్నార‌నే విష‌యం త‌న‌కు నిజంగా తెలియ‌దంటున్నాడు. అందులో కొంద‌రు మాత్ర‌మే త‌న‌కు తెలిసిన వాళ్లున్నార‌ని.. తెలియ‌ని వాళ్ల గురించి కూడా షో మొద‌ల‌వ్వ‌డానికి కేవ‌లం 5 నిమిషాల ముందు హౌజ్ వెనక ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లి త‌న‌కు చూపించార‌ని చెబుతున్నాడు నాగార్జున‌. న‌మ్మ‌డానికి క‌ష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం అంటున్నాడు నాగార్జున‌.

అస‌లు త‌న‌కు కూడా ఏం వివ‌రాలు చెప్ప‌లేద‌ని.. బిగ్ బాస్ షో అంటేనే అలా ఉంటుంద‌ని అప్పుడు అర్థ‌మైన‌ట్లు చెప్పాడు నాగ్.ఇక వివాదాలు అనేవి గాల్లోంచి కూడా వ‌స్తాయ‌ని.. బిగ్ బాస్ అనేది 14 దేశాల్లో న‌డుస్తుంద‌ని.. హిందీలో 12.. క‌న్న‌డ‌లో 2.. మ‌ళ‌యాలంలో 4.. త‌మిళంలో 3 సీజ‌న్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు తెలుగులో మూడో సీజ‌న్ న‌డుస్తుంది. ఇంత పాపులర్ షోపై కాంట్ర‌వ‌ర్సీలు కామ‌న్ అంటున్నాడు నాగార్జున‌.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.