క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త..

టీవీలు అంతగా లేని రోజులలో క్రికెట్ స్కోర్ ని చాలా మంది రేడియోలలో వినేవాళ్ళు .కాలక్రమేణా టివిలు అందుబాటులోకి రావడం తో చాలా మంది క్రికెట్ ని ప్రత్యక్షంగా క్రికెట్ చూసి ఆనందించడం జరుగుతోంది. కానీ ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ లో టివిల ముందు క్రికెట్ చూడడానికి ఎవరికి కుదరడం లేదు.ఇప్పుడు చెప్పే వార్త క్రికెట్ ప్రియులకు నిజంగా శుభవార్తే . టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌ని వీక్షించలేనటువంటి క్రికెట్ అభిమానుల కోసం బీసీసీఐ ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లైవ్ కామెంట్రీ కోసం అల్ ఇండియా రేడియోతో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఒప్పందంలో భాగంగా ఇకపై కోహ్లీసేన ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు స్వదేశంలో జరిగే దేశవాళీ టోర్నీలకు సంబంధించి లైవ్ కామెంట్రీని క్రికెట్ అభిమానులకు అందించనుంది. ఈ చొరవ భారతదేశం అంతటా ఉన్న మిలియన్ల మంది క్రికెట్ అభిమానులు లైవ్ రేడియో కామెంట్రీని అనుసరించే అవకాశాన్ని కల్పిస్తుంది.మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ అవకాశం అందుబాటులోకి రానుంది.

అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు, దిగువ పురుషుల మరియు మహిళల దేశీయ టోర్నమెంట్లు మరియు మ్యాచ్‌లకు కూడా ఏఐఆర్ కరేజీని అందిస్తుంది. రెండేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 10, 2019 నుండి ప్రారంభమై 2021 ఆగస్టు 31 వరకు నడుస్తుంది.

Domestic Tournaments

Event

Total matches

Total Match days

Ranji Trophy

1 x 5-day Final

5

Duleep Trophy

1 x 5-day  Final

5

Deodhar Trophy

3 x 1-Day League games

3

Deodhar Trophy

1 x 1-Day  Final

1

Women’s Challenger Series

4 x 1-Day games

4

Syed Mushtaq Ali Trophy Super League

10 x League matches

5

Syed Mushtaq Ali Trophy league

1 x Final

1

Irani Cup (Men)

1 x 5-day Match

5

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.