"లాయర్ సాబ్" గా బాలయ్య

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందుకోసం ఆయనకు కొన్ని స్క్రిప్టులు కూడా పంపించారు. ఎందుకో మరి వీరి సినిమా మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే, నందమూరి బాలకృష్ణ - దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరి అడుగులు పడుతున్నాయని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం ‘పింక్'. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘పింక్' తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ఆయన భారీ మొత్తాన్నే చెల్లించారని కూడా ప్రచారం జరుగుతోంది.

బాలయ్యతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని భావిస్తున్నారు దిల్ రాజు. ఇందులో భాగంగానే ఆయనను దృష్టిలో ఉంచుకుని ‘పింక్' తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయమై ఆయన.. బాలయ్యతో చర్చలు కూడా జరిపారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. దీనికి బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.