అయోధ్య తీర్పు

11:34

‘ఇది చారిత్రక తీర్పు. ఈ తీర్పుతో భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది’- హిందూ మహాసభ లాయర్‌ వరుణ్‌ కుమార్‌ సిన్హా

11:30 వివాదాస్పద స్థలం హిందువులదే

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

11:11 అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తుది తీర్పు

చారిత్రక అయోధ్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగీవ్రంగా తీర్పును వెల్లడించింది. సీజేఐ గొగొయ్‌ అయోధ్యపై తీర్పును చదివి వినిపించారు. ‘‘మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి. ఇందుకోసం సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం ఇవ్వాలి. కేంద్రం లేదా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకోవాలి’’ అని రంజన్‌గొగొయ్‌ తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.