నాకు అన్నీ మా అన్నయ్యే

తనకు తల్లైనా, తండ్రైనా అన్నీ అన్నయ్యేనని బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సోదరి అన్షులా కపూర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపన్నులకు హస్తం అందించేందుకు అన్షులా ఇటీవలే ‘ఫ్యాన్‌కైండ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫండ్‌రైజింగ్‌ వెంచర్‌ను ప్రారంభించారు. చారిటీ కార్యక్రమాల గురించి చర్చించుకునేందుకు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ‘ఫ్యాన్‌కైండ్‌’ వారధిగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ మీడియా సమావేశానికి హాజరైన ఆమెకు తన అన్న అర్జున్‌ కపూర్‌ గురించి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చిన అన్షులా.. అర్జున్‌ రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ గురించి అడగగానే ఒకింత అసహానికి గురయ్యారు. మలైకాతో అర్జున్‌ను ముడిపెట్టి మాట్లాడటం తనకు ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. వారిద్దరి గురించి వస్తున్న వదంతుల గురించి తానేమీ మాట్లాడదలచుకోవడం లేదని చెప్పారు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడు, తండ్రిలా చూసుకునే అన్నతో ఇటువంటి విషయాలు చర్చించనని చెప్పుకొచ్చారు.

కాగా అర్జున్‌ కపూర్, అన్షులా‌.. నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా పిల్లలు అన్న సంగతి తెలిసిందే. శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్‌, అతడి చెల్లి అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. అయితే శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్‌.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు. ఇక అర్జున్‌ కపూర్‌- మలైకా అరోరా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.