మళ్ళీ ప్రేమలో పడిన అమలాపాల్‌

మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్‌ మళ్లీ ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమే బయట పెట్టింది. ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని పాండిచ్చేరిలో నివాసం వుంటున్నానని తెలిపింది. ‘మైనా’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆ చిత్రం ద్వారా ఒక్కసారిగా మంచి గుర్తింపు పొందింది. అనంతరం పలు చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారింది. దక్షిణాది తారగా మారి వరసగా తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. స్టార్‌ హోదాలో ఉన్న సమయంలో స్టార్‌ డైరెక్టర్‌ విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకుని సినిమాలకు దూరంగా వుంది. మూడేళ్ళ వివాహబంధంలో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మళ్ళీ కొంత గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి మంచి చిత్రాలను ఎంచుకొని నటిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రం ‘ఆడైలో నటించింది. ఈ చిత్రంలో నగ్నంగా నటించి మళ్ళీ వార్తల్లో నిలిచింది.

అయితే ఈ చిత్రంలో మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్తావించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి పలు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అమలాపాల్‌ పాల్గొంది. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఆ సందర్భంగా ఆమె తన మనసులోని విషయాలను పంచుకున్నారు. తాను ప్రేమలో పడ్డానని, ప్రస్తుతం అతనితో పుదుచ్చేరిలో నివాసం వుంటున్నానని, ప్రస్తుతం తాను ఇలా ఉండటానికి కారణం ఆయనేనని, తాను చాలా అప్సెట్‌లో ఉన్న సమయంలో అతని పరిచయం ఏర్పడిందని తెలిపింది. తన గురించి అతనికి అన్ని విషయాలు బాగా తెలుసునని, తన కెరియర్‌ కోసం అతను ఉద్యోగం కూడా వదులుకున్నారని తన ప్రియుడు గురించి తెలిపింది. అయితే అయిన పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇటీవలే అమలాపాల్‌ మాజీ భర్త డైరెక్టర్‌ విజయ్‌ చెన్నైకు చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.