అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా

Allu Arjun craze in kakinada,Allu Arjun visits kakinada,Warm welcome for Allu Arjun

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, ప్రముఖ దర్శకుడు తివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ తదుపరి షెడ్యూల్‌ కాకినాడలో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో బన్నీపై పోరాట సన్నివేశాలతో పాటు, కొన్ని ముఖ్యమైన సీన్స్‌ను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఇందుకోసం బన్నీ బుధవారం కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు బన్నీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.