బిగ్ బాస్ హౌజ్ లో నటి మధుమిత ఆత్మహత్యాయత్నం!

ఈ మద్య సినీ సెలబ్రెటీలు చాలా సున్నితమైన మనసుతో ఆలోచిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. కెరీర్ సరిగా సాగడం లేదని, తాము ఎంతగానో నమ్ముకున్న ప్రియుడు, ప్రియురాలు మోసం చేసిందని, ఆర్థిక ఇబ్బందులతో ఇలా ఎన్నో రకాల మనోవ్యధలతో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సెలబ్రెటీలు ఆత్మహత్యలను నిర్మూలించాలని..ధైర్యంతో అడుగు ముందుకు వేయాలని యాడ్స్, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వారే ఆత్మహత్యలకు పాల్పపడటం నిజంగా విచారించాల్సిన విషయం.

తాజాగా 'ఒరుకల్‌ ఒరు కన్నాడి' మూవీలోని తన నటనతో నవ్వులు పూయించి పేరు తెచ్చుకున్న నటి మధుమిత తాజాగా తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 3 లో కంటిస్టెంట్ గా వెళ్లారు.తాజాగా తమిళ బిగ్ బాస్ 3 లో నటి మధుమిత కెప్టెన్‌ బాధ్యతలను నిర్వహిస్తూ, ఒత్తిడిని తట్టుకోలేక ఈ పని చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి వెంటనే బయటకు పంపించేశారు. బయటకు వచ్చిన మధుమిత ఎంతో ఆవేదనకు గురైంది. బిగ్ బాస్ హౌజ్ లో బయటకు కనిపిస్తున్నంత మంచి మనుసున్నవారు కాదని..తనను టార్గెట్ చేసుకొని దారుణంగా హింసించారని..మాటలతో చిత్రం హింస చేశారని,అందువల్లే చనిపోవాలని అనిపించిందని వ్యాఖ్యానించడం గమనార్హం. కమల్ వ్యాఖ్యాతగా ఉన్న గత రెండు సీజన్లలోనూ పలు వివాదాస్పద ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మద్య తమిళ్ బిగ్ బాస్ లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారని తెగ వార్తలు కూడా వచ్చాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.