విజయారెడ్డి హత్య: ఆరోపణలు పై సీఎంకు లేఖ రాసిన మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యోదంతం నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఎల్‌బీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎంఆర్ఓ విజయారెడ్డి హత్యకు కారణమైన నిందితుడి బంధువులు వారు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వివాదానికి కారణమైన 412 ఎకరాల భూమి సర్వే నంబర్లపై విచారణ చేపట్టాలని కోరారు. ఆ భూములు ఎవరెవరి పేర్లపై ఉన్నాయి? వారికి ఆ భూమి ఎలా వచ్చింది? ఎలా డాక్యుమెంటేషన్‌ చేసుకున్నారు? తదితర అంశాలపై విచారణ చేయాలన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఏడాదిన్నర క్రితం 60 కుటుంబాలు తన వద్దకు వస్తే వారందరినీ జేసీ వద్దకు తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరానని గుర్తుచేశారు. ఈ భూవ్యవహారంపై విచారణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్టు చెప్పారు. ఈ లేఖ ప్రతుల్ని సీఎస్‌, డీజీపీలకు కూడా పంపుతున్నట్టు మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ ఉదంతంపై వాస్తవాలన్నీ పోలీసుల విచారణలో తేలుతాయన్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.