ఆవిరి మూవీ ఫస్ట్ లుక్ విడుదల

విభిన్న కథాంశాలతో మూవీస్ రూపొందించే రవిబాబు దర్శకత్వం లో మరో ప్రయోగాత్మక మూవీ ఆవిరి రూపొందింది. అల్లరి మూవీ తో సినీకెరీర్ ప్రారంభించిన రవిబాబు దర్శకత్వం వహించిన అమ్మాయిలు అబ్బాయిలు, నచ్చావులే, మనసారా, అవును వంటి మూవీస్ విజయం సాధించాయి. తక్కువ బడ్జెట్ తో మూవీస్ రూపొందించే రవిబాబు కు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఉంది. రవిబాబు తన కొత్త సినిమా ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగేలా చేశారు.

రవిబాబు దర్శకుడే కాకుండా నటుడు, నిర్మాత కూడా. తన స్వంత ప్రొడక్షన్ హౌస్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై పలు మూవీస్ రూపొందించారు. దిల్ రాజు సమర్పణ లో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో రవిబాబు, నేహా చౌహాన్, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆవిరి మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఆవిరి మూవీ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. మారుతున్న స్టవ్ పై ఉన్న కుక్కర్ లో భయపడుతూ చూస్తున్న యువతి తలతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ భయపెడుతూ , ఆసక్తి కలిగేలా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.