చనిపోతున్న ప్రియురాలిని పెళ్లాడిన ప్రియుడు !

కర్రలతో, కత్తులతో, ఆసిడ్ లతో దాడులు చేస్తూ ప్రియురాలును నరకం చూపుతున్న, ప్రేమికులున్న ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమికులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే..! నిజమైన ప్రేమికుడు ఎంత కష్టమొచ్చిన తన ప్రేమను వదలడు అనే మాటలు నిజమని నిరూపించాడు ఓ వ్యక్తి. తన ప్రియురాలు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోందని తెలిసినా. ఆమె చివరి కోరికను తీర్చాడు. జీవితంతో పోరాడి ఆమె ఓడిపోయినా. అతడు మాత్రం ప్రేమను గెలిపించి ఒంటరిగా మిగిలిపోయాడు. సినిమా కథను తలపించే ఈ యథార్థ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది.

పశ్చిమబెంగాల్‌కు చెందిన బీతీదాస్‌ అనే యువతి ఎముకుల క్యాన్సర్‌తో బాధపడుతూ మరణించింది. వైద్యులు కీమోథెరపీ చేస్తున్నప్పుడే ఆమె బతకడం కష్టమని తేల్చేశారు. తాను బతకనని తెలుసుకున్న బీతీ. తన ప్రియుడు సుబ్రతాకుంద్‌ను పెళ్లాడి ఆ ఆత్మసంతృప్తితో మృత్యు ఒడిని చేరాలనుకుంది. ఇదే కోరికను తన ప్రియుడికి చెప్పింది. తన ప్రియురాలి చివరి కోరికను బరువెక్కిన హృదయంతో అంగీకరించిన ఆ ప్రేమికుడు.. వివాహానికి సూచనగా బీతీ పాపిటిలో తిలకం దిద్ది భార్యగా చేసుకున్నాడు. తన ప్రేమికుడిని పెళ్లాడిన సంతృప్తితో అతడి చేతిలో చేయివేసి రెండుగంటల అనంతరం ఆమె కన్నుమూసింది.

అంతకు ముందు బీతీకి క్యాన్సర్‌ ఉందన్న విషయం బయటపడిన తరువాత కూడా సుబ్రతా కుంద్‌ తన ప్రియురాలిని దూరం చేసుకోలేదు. ఆమెకు చికిత్స చేయించేందుకు దేశంలోని పలు క్యాన్సర్‌ ఆసుపత్రులకు తిరిగాడు.కానీ విధి వారిని వెక్కిరించింది. కాలం వారి మధ్య దూరం పెంచింది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.