ఆర్టీసీ ఆపేలా లేరు, కెసిఆర్ తగ్గేలా లేరు!

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 13వ రోజుకు చేరుకుంది. ఒకపక్క హైకోర్టు ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ప్రభుత్వానికి, కార్మికులకు పట్టింపులకు, పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈరోజు సాయంత్రం లోపు చర్చ జరగాలని డెడ్లైన్ విధించింది. కానీ ఆర్టీసీ కార్మికులతో, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదు. సమ్మె విరమించి వెళ్లేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా లేరు.

కార్మికులతో చర్చలు లేనట్టే అన్న సంకేతాలిచ్చిన కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. అయితే కోర్టు ఆదేశాల మేరకు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని చెప్పినా కార్మికులు పట్టించుకోవడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విర మించకుండా, ఇంత మొండితనం గా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కార్మికులతో ఇక చర్చలు లేవని కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించాలని నిర్ణయించారు.

సమ్మె మాట భవిష్యత్ లో వినిపించకుండా చేస్తా అంటున్న సీఎం సమ్మెతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందని, భవిష్యత్‌లో ఎప్పుడు కార్మికుల నోటి నుండి సమ్మె మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కోర్టు ఆదేశించినా చర్చల పట్ల సానుకూలత వ్యక్తం చెయ్యటం లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు వారే ఒకడుగు వెనక్కు తగ్గి రావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన సీఎం కేసీఆర్ ఇదే అంశంపై మరోసారి చర్చలు జరపనున్నారు. మంత్రి పువ్వాడ, రవాణా శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.