100 కోట్ల క్లబ్ లో 'ఎఫ్ 2'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'ఎఫ్ 2' సినిమా .. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి బరిలోకి దిగింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది.

అలా ఈ సినిమా థియేటర్లకు వచ్చిన 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకి పైగా షేర్ ను .. ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన తొలి సినిమాగా తన ప్రత్యేకతను చాటుకుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' ఉంటుందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఈ సీక్వెల్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతోపాటు రవితేజ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.